Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మూడు రాఫెల్ యుద్ధ విమానాలు వారం రోజుల్లో భారత్‌కు చేరుకోనున్నాయి. చివరి దఫాగా ఫ్రాన్స్‌లో భారత వాయు సేన ఇప్పటికే డెలివరీ తీసుకుందని, ఈ వారం మధ్యలో దేశానికి చేరుకుంటాయని రక్షణరంగ అధికారులు తెలిపారు. గత దఫాల్లో వచ్చినట్లుగానే ఫ్రాన్స్ నుంచి నేరుగా భారత్‌కు చేరుకుంటాయి. వీటికి గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సామర్థ్యం ఉంది. భారత్ చేరుకున్న రాఫెల్ విమానాలను భారతీయ సామర్థ ప్రమాణాల ప్రకారం ఆధునీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రాఫెల్ విమానాల్లో భారతీయ స్టాండర్ట్ జెట్లు అత్యంత అధునాతనమైనవని అధికారులు చెబుతున్నారు. 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2016లో భారత్, ఫ్రాన్స్‌లు 7.87 బిలియన్ డాలర్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.