Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగానికి ఇస్రో సిద్ధం
బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్‌ను నేడు (సోమవారం) నింగిలోకి పంపనున్నది. ఈఓఎస్-04 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ మోసుకెళ్లనున్నది. ఈ మేరకు రాకెట్ ప్రయోగానికి ఆదివారమే 25 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని ఇస్రో ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేట్ సెంటర్ తొలి లాంచ్ ప్యాడ్ నుంచి షెడ్యూల్ ప్రకారం ఉదయం 5.59 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. రెండు చిన్న కో-ప్యాసింజర్ శాటిలైట్లను కూడా రాకెట్ మోసుకెళ్లనున్నది. ఇప్పటికే శాస్త్రవేత్తల బృందం షార్కు చేరుకున్నది. కాగా, ఉపగ్రహం బరువు 1710 కేజీలు. వ్యవసాయం, అటవీ, ప్లాంటేషన్స్, నేలలో తేమ, హేడ్రాలజీ, వరదల మ్యాపింగ్‌లకు సంబంధించి ఈ శాటిలైట్ హై క్వాలిటీ చిత్రాలను తీసి పంపిస్తుంది. ఈ ఏడాదిలో ఇదే ఇస్రోకు తొలి ప్రయోగం కావడం గమనార్హం.