Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెంపదెబ్బకొట్టిన సంగీత్ సోమ్ యూపీలో ఘటన
- ఎఫ్ఐఆర్ నమోదు
న్యూఢిల్లీ: తొలి దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ వద్ద ప్రిసైడింగ్ అధికారిని కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిబ్రవరి 10 మధ్యాహ్నం 3 గంటలకు సోమ్,అతని మద్దతుదారులు మీరట్ జిల్లా సాల్వా గ్రామంలోని బూత్ 131కి చేరుకున్నారు. బూత్ వెలుపల ఓటర్లు పెద్ద క్యూలో ఉండటంతో ఎమ్మెల్యేలు ''డిస్టర్బ్'' అయ్యారు. ఓటింగ్ నెమ్మదిగా సాగుతున్నతీరుపై.. ప్రిసైడింగ్ అధికారితో సోమ్ వాదనకు దిగారు. ఆగ్రహంతో అధికారిని చెంపఛెళ్లుమనిపించారు. ఎమ్మెల్యే మద్దతుదారులు బూత్ లోపల అమర్చిన సీసీ కెమెరాలను కూడా ఎత్తుకెళ్లారు. ప్రిసైడింగ్ అధికారి అశ్విని శర్మని కొట్టిన కేసులో..సర్ధాన స్టేషన్ ఇన్చార్జి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని మీరట్ ఎస్పీ ప్రభాకర్ చౌదరి తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని,ఎస్పీ తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీని ఎన్నికల కమిషన్‌కు పంపినట్టు అధికారి తెలిపారు. సోమ్ సర్ధానా నుంచి బీజేపీ అభ్యర్థిగా వరుసగా మూడవసారి ఎమ్మెల్యేగా అభ్యర్థిస్తున్నారు. తాజా ఎఫ్ఐఆర్తో, సోమ్‌పై ఇప్పుడు ఎనిమిది కేసులు ఉన్నాయి, అయితే వాటిలో దేనిలోనూ అతనికి ఇంకా శిక్ష పడలేదని సమాచారం.
2013 ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో సోమ్ నిందితుడు.
వివాదస్పద వీడియోను అప్లోడ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న సోమ్‌పై గతేడాది యూపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముగింపు నివేదికను దాఖలు చేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్, 2018లో బులంద్‌షహర్‌లోని పోలీస్ స్టేషన్లోనే జరిగిన దాడిలో హతమయ్యాడని స్థానికులు అంటున్నారు.