Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ ప్రవీణ్ ప్రకాష్‌ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఎపి భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అక్కడున్న ఐపిఎస్ అధికారి భావనా సక్సేనా కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో ఆమెను రిలీవ్ చేస్తూ మరో ఉత్తర్వును జారీ చేశారు. ఈ ఏడాది జూలైలో సాధారణ పరిపాలనశాఖ (పొలిటికల్) బాధ్యతల నుంచి ప్రవీణ్ ప్రకాశ్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. అప్పటి సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ ప్రవీణ్ ప్రకాష్ జారీ చేసిన ఉత్తర్వులు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అకస్మిక బదిలీ చర్చనీయాంశంగా మారింది.