Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి :ఏపీలో రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెల 18వ తేదీ నుంచి అమలులో ఉన్న రాత్రి కర్ఫ్యూను తొలగిస్తున్న ట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. వైద్య,ఆరోగ్యశాఖపై సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మాస్క్‌లు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని, కరోనా టెస్ట్‌లు, వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 0.82 శాతానికి తగ్గిందని, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 14,276కు తగ్గినట్లు ఈ సమావేశంలో అధికారులు సిఎంకు నివేదించారు. అనంతరం సిఎం మాట్లాడుతూ రాత్రి కర్ఫ్యూను ఎత్తివేసినా, కరోనా మార్గదర్శకాలను కొనసాగించా లన్నారు. ఫీవర్ సర్వే కొనసాగించాలని, జ్వరం లక్షణాలున్న వారికి టెస్ట్‌లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వయస్సుల వారీగా వ్యాక్సినేషన్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వేర్వేరుగా పరిపాలన, చికిత్స విభాగాలు
ఆసుపత్రులలో పరిపాలన, చికిత్స విభాగాలను ఇకనుండి వేరు చేయాలని సిఎం ఆదేశించారు. పరిపాలనలో నిపుణులైన వారికి ఆ బాధ్యతలు అప్గపించాలన్నారు. వైద్యారోగ్యశాఖలో రిక్రూట్మెం ట్ను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.. గిరిజన ప్రాంతాలలో పని చేసే స్పెషలిస్టులు, ఇతర వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వాలన్నారు.