Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు మాసాల గరిష్టానికి ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : దేశంలో ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఏడాది జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) 6.01 శాతానికి ఎగిసింది. ముఖ్యంగా అహారోత్పత్తులు, తయారీ రంగ ఉత్పత్తుల ధరలు ఆకాశానంటడంతో ద్రవ్యోల్బణం ఏడు మాసాల గరిష్టానికి చేరింది. 2020 డిసెంబర్లో సీపీఐ 5.66 శాతం, 2021 జనవరిలో 4.06 శాతంగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల శాఖ నివేదిక ప్రకారం.. క్రితం జనవరిలో అహారోత్పత్తుల ధరలు 5.43 శాతం ఎగిశాయి. ఇది ఇంతక్రితం నెలలో 4.05 శాతంగా ఉంది. కరోనా సంక్షోభం ప్రారంభం నుంచి వంట నూనె, చారుపత్తి, పప్పుల ధరలు 20-40 శాతం మేర పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తుంటే.. మరోవైపు తాజా గణంకాలు సెంట్రల్ బ్యాంక్‌ను ఆందోళనకు గురి చేసేలా ఉన్నాయి.