Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 347 మంది మృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతుండటం ఊరట కలిగిస్తోంది. కోవిడ్ థర్డ్‌వేవ్ వేళ ఆందోళనలను ఉన్నప్పటికీ రోజువారీ కేసులు తగ్గుతుండటంతో కాస్త ఉపశమనం కలుగుతోంది. మరో వైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 173.42 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంగళవారం ఉదయం కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు ... గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,409 కరోనా కేసులు నమోదయ్యాయి. 82,817 మంది కోవిడ్ బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అలాగే సోమవారం 347 మంది వైరస్‌తో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,23,127 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.23 శాతంగా ఉందని పేర్కొంది.