Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్‌లో ఆప్ గెలుస్తుందని వ్యాఖ్య
చండీగఢ్ : కాంగ్రెస్‌కి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ సీనయర్ నేత, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి అశ్వనీ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఆప్‌కి అనుకూల పవనాలు వీస్తున్నాయని.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీనే విజయం సాధించి తీరుతుందని జోస్యం చెప్పారు. మంగళవారం పంచాయత్ ఆజ్‌తక్‌లో అశ్వనీ కుమార్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో రాష్ట్ర పరిస్థితులను పరిశీలిస్తే.. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వస్తుందని.. కాంగ్రెస్ ఓడిపోతుందని అన్నారు. తాను జ్యోతిష్యుడిని కాకపోయినప్పటికీ.. రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేయగలనని అన్నారు. అకాలీదళ్, కాంగ్రెస్‌లకు కంచు కోటలుగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోన ఆప్ అభ్యర్థులకు మద్దతు లభిస్తోందని, ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కచ్చితంగా చెప్పగలనని అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాల్లో లోపం లేదని, తాను ఆ పార్టీకి సలహాలు ఇవ్వాలని అనుకోవడం లేదని చెప్పారు. అయితే ప్రస్తుతం సమష్టి నాయకత్వాన్ని తీసుకురావడం తప్పనిసరి అని చెప్పారు. సీనియారిటీకి, ప్రతిభకు సముచిత గౌరవం ఇవ్వాలని చెప్పారు. పెద్దల గౌరవ, మర్యాదలను భంగపరచకూడదన్నారు. జి-23 నేతల వ్యతిరేకతపై స్పందిస్తూ.. వారు కేవలం ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని, గాంధీ కుటుంబ సభ్యులు ఉండగా మరొకరికి అవకాశం రాదన్న విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు. అశ్వనీ కుమార్ రాజీనామాపై మరో సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ స్పందించారు. గతంలో ఆయన జి-23 గ్రూప్ నేతలను వ్యతిరేకించారని, అలాంటి వ్యక్తి పార్టీకి రాజీనామా చేయడం చూసి ఆశ్చర్యపోతున్నానని అన్నారు.