Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌతమ్ సవాంగ్ బదిలీ
అమరావతి :ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటిలిజెన్స్ డిజిగా ఉన్న కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డిని నూతన డీజీపీగా నియమితులైనారు. మంగళవారం ఉదయం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జులై వరకు సవాంగ్‌కు పదవీ కాలం ఉన్నప్పటికీ అకస్మికంగా ఆయన్ను బదిలీ చేయడం, సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలంటూ ఉత్తర్వులివ్వడం విశేషం. ఆయన స్థానంలో నియమితులైన రాజేంద్రనాథ్‌రెడ్డి డీజీపీిగా అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రెగ్యులర్ డిజిపిగా వ్యవహరించడానికి కేంద్రం నుండి ఆమోదం లభించాల్సివుంది. 1992 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి స్వస్థలం కడప జిల్లా రాజుపాలెం మండలం పర్లపాడు గ్రామం. ఆయన గతంలో విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనరుగా పనిచేశారు. హైదరాబాద్ వెస్ట్‌జోన్ ఐజిగా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు డిజిగా కూడా పనిచేశారు. ఔషధ నియంత్రణ విభాగంలోనూ బాధ్యతలు నిర్వహించారు. రాజేంద్రనాథ్‌రెడ్డి 2026 వరకు పదవిలో కొనసాగే అవకాశం సిఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌ను బదిలీ చేసిన 24 గంటలు దాటకముందే డీజీపీ సవాంగ్‌ను కూడా బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.