Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంతర్ మంతర్ వద్ద డీవైఎఫ్ఐ ఆందోళన
- అరెస్టు చేసిన పోలీసులు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 60 లక్షల పోస్టులను భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, మతతత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన డీవైఎఫ్ఐ నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డీవైఎఫ్ఐ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నాడిక్కడ స్థానిక జంతర్ మంతర్ వద్ద డీవైఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ప్లకార్డులు చేబూని ఖాళీలను భర్తీ చేయాలనీ, నిరుద్యోగాన్ని తగ్గించాలని నినదించారు. దేశవ్యాప్తంగా 60 లక్షల ప్రభుత్వ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.నిరసనకు అనుమతులు ఉన్నప్పటికీ డీవైఎఫ్ఐ నేతలను జంతర్మ ంతర్ వద్ద నిర్దేశించిన నిరసన ప్రదేశానికి చేరుకోవడానికి అనుమతించలేదు. నేతలను మార్గ మధ్యలోనే నిర్బంధించారు. బలవంతంగా యువతీ, యువకులను అరెస్టు చేసి బస్సుల్లో కుక్కారు. అక్కడి నుంచి మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాలుగు గంటలకు పైగా పోలీసు కస్టడీలో ఉన్న వారిని సొంత పూచీకత్తుతో విడుదల చేశారు. దేశంలో మోడీ ప్రభుత్వం యువతపై, వారి జీవనోపాధిపై దాడి చేస్తున్నదనీ, అలాగే యువతి మనసులోని మాటను మాట్లాడే, వారు కోరుకున్న వాటిని ధరించే హక్కుపై దాడి చేస్తుందని డీవైఎఫ్ఐ నేతలు విమర్శించారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.