Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఐడీబీఐ బ్యాంక్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి మోడీ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. తొలుత ప్రయివేటు పెట్టుబడిదారుల అభిప్రా యాలను తెలుసుకునేందుకు రోడ్‌షోలు నిర్వహించాలని భావిస్తున్నది. ఫిబ్రవరి 25 నుంచి ఇవి ప్రారంభం కానున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వంతోపాటు ఎల్ఐసీకి మెజారిటీ వాటా ఉంది. అయితే పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా తమ వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వర్చువల్ మాధ్యమంలో రోడ్‌షోలు నిర్వహించాలని నిర్ణయించింది. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం, కేపీఎంజీ, లింక్ లీగల్ సంయుక్తంగా ఈ రోడ్‌షోలను నిర్వహంచను న్నాయి. ఐడీబీఐలో ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్ఐసీకి 49.24 శాతం వాటాలు న్నాయి. కొత్త కొనుగోలుదారుకు యాజమాన్య హక్కులు బదిలీ చేసేందుకు వీలుగా తమ వాటాల్లోనూ కొంత విక్రయించాలని ఎల్ఐసీ యోచిస్తోంది. ఆర్బీఐని సంప్రదించి ఎవరు ఎంత వాటా విక్రయించాలో నిర్ణయించను న్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రభుత్వం 26శాతం వాటాలను అట్టిపెట్టు కునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.