Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ
చండీగఢ్ : పంజాబ్‌లో పోలింగ్ దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఆప్, అమరీందర్‌సింగ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రధాని మోడీ కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఒక్క అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. రవిదాస్ జయంతి సందర్భంగా కరోల్ బాగ్‌లోని 'శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్'లో ప్రధాని బుధవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పఠాన్‌కోట్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడారు. మీకు సేవ చేసేందుకు నాకు సమయం ఇవ్వండి అని కోరారు. ఒక్క ఐదేండ్లు ఛాన్స్ ఇచ్చి చూడండి.. పంజాబ్ రూపు రేఖలు మొత్తం మార్చివేస్తామని అన్నారు.