Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగుతున్న బ్యాంక్‌లు
- 'మొండి'గాళ్లకే మోడీ సర్కార్ అండ
- సామాన్యుల సొమ్ము కార్పొరేట్ల పాలు
న్యూఢిల్లీ : మోడీ అధికారంలోకి వచ్చాక.. దేశంలో లూట్ మోడల్ ఉరుకులాడుతోంది. బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలు అస్సలు ఆగటంలేదు. గుజరాత్‌లోని ఏబీజీ షిప్‌యార్డ్ కంపెనీ ఏకంగా రెండు డజన్లకు పైగా బ్యాంకుల్ని నిండా ముంచి, రూ.23 వేల కోట్లు శఠగోపం పెట్టిన విషయం విదితమే. దీనిపై గోడీ మీడియా సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే.. గుజరాత్‌లోని కంపెనీ చేసిన ఫ్రాడ్ కాబట్టి..అనే చర్చ నడుస్తోంది. బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలను పరిశీలిస్తే..2015 నుంచి 2018 వరకు సుమారు రూ.రెండు లక్షల కోట్లు ఫ్రాడ్ జరిగితే.. 2019 నుంచి 2021 వరకు అంటే.. ఈ మూడేండ్ల రూ.3.90 లక్షల కోట్ల పైనే జరిగాయని నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి. 2014 మోడీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పదివేల కోట్ల మేర ఫ్రాడ్ జరిగిందని సమాచారం. మొత్తంగా బీజేపీ జమానాలో ఆరు లక్షల కోట్లకుపైనే ఫ్రాడ్ జరిగినట్టు అధికార వర్గాలు అంటున్నాయి. ఇక ఏబీజీ విషయానికి వస్తే..ఆ కంపెనీ వాణిజ్య ఓడలను తయారు చేస్తోంది. వాటికి మరమ్మతులు చేస్తోంది. గుజరాత్‌లోని సూరత్, దహేజ్ ప్రాంతాల్లో ఉన్నది. 2013 నుంచి 2022 వరకు తీసుకున్న అప్పు అమాంతంగా పెరిగిపోయిది. రుణాలు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం ఎన్సీఎల్టీ వద్దకు వెళ్లింది. అక్కడ దర్యాప్తు కొనసాగుతోంది. ఆర్బీఐ కూడా సీబీఐకి లేఖ రాసింది. ఇలా కాగితాలు రాసుకుంటూ..2022 ఫిబ్రవరి దాకా లాక్కొచ్చారు. ఏబీజీ విషయంలో ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి ఎనిమిదేండ్లు పట్టిందంటే..దీని వెనుక ఉన్నది ఎవరు..?రుణాలిచ్చిన సంస్థలను మెడపట్టించి కక్కించలేరా..? కేంద్రం ఎందుకని గమ్మునుంటున్నదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మోడీ చెబుతున్నట్టు నిజంగా మనం ఒక మోడల్‌గా దేశాన్ని తయారు చేశామా..? కార్పొరేట్లు దోచుకెళ్తుంటే..జనం పైసలివ్వాలా.. బ్యాంకులను కొల్లగొడుతున్న పెద్దమనుషులను వదిలేస్తుంటే.. తమ సొమ్ము భద్రతకు దిక్కెవరని జనంలో ఉదయిస్తోంది. ఎన్సీఎల్టీ వద్ద 21 వేలకు పైగా ఫ్రాడ్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ ఫైళ్లను తెరిచిచూడటానికి మరో ఎనిమిదేండ్లు ఎదురు చూడాలా..అన్న చర్చ వినిపిస్తోంది. ఆ బ్యాంకు, ఈ బ్యాంకు అనే తేడాలేకుండా ఎన్నో కేసులపై వ్యాజ్యాలు నడుస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఢిల్లీ జింఖానా గ్రౌండ్ , ఎస్బీఐకి సంబంధించి ఇండియన్ పవర్ కార్పొరేషన్ బ్యాంక్ లిమిటెడ్, ఎస్ బ్యాంక్ తులిప్ స్టార్ హోటల్ గురించి, ఐసీఐసీఐ గ్యాలియర్ బైపాస్ ప్రాజెక్టు, బ్యాంక్ ఆఫ్ ఇండియా బేసిక్ ఇండియా, ఇలా ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
బ్యాంకుల్లో మోసాలు అనంతం..
బ్యాంకులనుంచి కోట్లాది రూపాయలు ఫ్రాడ్ జరిగిందనుకుంటే..ఆ డబ్బు సామాన్యులది. బ్యాంకుల్లో దాచుకున్నది సర్కార్ సొమ్ము కాదు. ప్రజల కష్టార్జితాన్ని పొదుపు చేసుకుంటే..దానికి సర్వీసు చార్జీలు వసూలు చేసుకుంటూ..స్వల్పమొత్తంలో ఆ నిల్వలకు వడ్డీ ఇస్తోంది. అయితే దేశంలోని బడా బ్యాంకులు ఎందుకింతగా లోన్లు ఇస్తున్నాయి. ఒక సంస్థకు రుణం ఇచ్చేటపుడు అంతకుముందు పూర్వాపరాలను ఎందుకని సునిశితంగా పరిశీలించటం లేదన్న ప్రశ్న సామాన్యుడి మెదడులో మెదులుతోంది. అయితే బ్యాంకుల్లో జరుగుతున్న మోసాలకు మేం బాధ్యులం కాదు. గత ప్రభుత్వమే కారణమంటూ విమర్శలు చేసి తప్పించుకోవటానికి మోడీ ప్రభుత్వం కాచుకుంటోంది. మన్మోహన్ చివరి ఏడాదిలో 19415 కోట్ల ఎన్‌పిఎలు రద్దు చేయగా.. మోడీ హయాంలో ప్రతి ఏటా..లక్ష కోట్లకు పైనే రద్దు చేసింది. మరోవైపు రుణం తీసుకుని పరారవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2019లో 27 మంది దేశం నుంచి పారిపోయారు. అందులో విజరుమాల్యా ఉన్నారు. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ కూడా. మంజిత్ సింగ్ మక్ని లాంటి వాళ్లు ఉన్నారు. ఇప్పటి వరకు బ్యాంకులకు ఎగనామం పెట్టి 50 మందికి పైగా పరారయ్యారు. పరారయ్యేదాక గమ్మునుండి.. విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నా.. ఇంటర్‌పోల్ ను భారత్ సంప్రదించింది. వారికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తోంది.2014 నుంచి 2017 వరకు (నాలుగేండ్ల) రుణం తీసుకుని పరారైన వారు. తాము చెల్లించే స్థితిలో లేమని విదేశాల్లో ఉండి బుకాయిస్తున్నారు. ఇప్పటికీ.. వారిపై ఎన్సీఎల్టీలో కేసులు నడుస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లకు పైగా పెద్దలకు మాఫీ (రైటాఫ్) చేసింది. 2018 నుంచి 2021 వరకు రూ.6 లక్షల కోట్లకుపైగా రాయిటాఫ్ చేసింది. ఇక కోవిడ్ కాలంలో లక్ష కోట్లకుపైగా రుణమాఫీ చేసింది. ఇలా చెప్పుకుంటే పోతే..లిస్టు చాలా పెద్దదే. ఇక డిపాల్టర్స్ గురించి నిలదీస్తే..అదిగో..ఇదిగో అంటూ పార్లమెంట్లో లిఖితపూర్వక సమాధానాలతో సరిపెడుతోంది. లూట్ మోడల్లో బ్యూరోక్రసీ తోడుగా నిలుస్తోంది. రెడ్ కార్నర్ నోటీసులు ఇన్ని ఇచ్చాం. కొత్త నిబంధనలు తెచ్చాం ఎవర్ని వదలమని చెప్పే మాటలు నీటి మూటలే. లూట్ సిస్టమ్ మన్మోహన్ హయాంలో స్పీడు కన్నా. మోడీ హయాంలో హండ్రెడ్ మీటర్ స్పీడ్‌లా మారిపోయింది.