Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏర్పాటు కానున్న ఏకీకృత స్థానిక స్వపరిపాలన శాఖ
- కేరళ సర్కారు నిర్ణయం
- ప్రకటించనున్న సీఎం విజయన్
- ప్రజలకు అందించే సేవల నాణ్యతను మెరుపరిచేందుకు ముందడుగు
తిరువనంతపురం : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేరళ రాష్ట్రం మరోసారి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలోని స్వయం పరిపాలన సంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించేలా నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ త్వరలో ప్రకటించనున్నారు. స్థానిక స్వపరిపాలన, అధికార వికేంద్రీకరణలో ప్రయోగాలు అనేక రంగాలలో ముఖ్యమైనవి. కేరళ ప్రభుత్వం ఇప్పుడు స్థానిక స్వపరిపాలన సంస్థలు అందించే సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచే విధంగా పరిపాలనా సంస్కరణ ను అమలు చేయాలని నిర్ణయిం చింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలోని ఐదు విభాగాలు పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, అర్బన్-రూరల్ ప్లానింగ్, ఎల్ఎస్జీ ఇంజినీరింగ్ విభాగాలు ఏకీకృత స్థానిక స్వపరిపాలన శాఖను ఏర్పాటు చేయడంలో భాగంగా విలీనం చేయబడ్డాయి. జిల్లాలోని అన్ని ఎల్ఎస్జీ సంస్థలకు జిల్లా స్థాయిలో జాయింట్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయడం వల్ల జిల్లా ప్రణాళిక సంఘం (డీపీసీ)తో పాటు అభివృద్ధి కార్యకలాపాల ప్రణాళిక, దాని అమలు మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఏకీకృత స్థానిక స్వపరిపాలన శాఖ స్థానిక స్వపరిపాలన సంస్థల కార్యకలాపాలను ముమ్మరం చేస్తుందని మరింత వేగవంతమైన ప్రజానుకూల సేవ లను అందజేస్తుందని స్థానిక స్వపరిపాలన మంత్రి ఎం.వీ గోవిందన్ మాస్టర్ తెలిపారు. కాగా, ఏకీకృత స్థానిక స్వపరిపాలన ఏర్పాటుపై విజయన్ ఈనెల 19న ప్రకటన చేయనున్నారు. వికేంద్రీకరణ ప్రక్రియ, స్థానిక స్వపరి పాలన సంస్థలను బలోపేతం చేయడానికి ఏకీకృత విభాగం ఏర్పాటు చేయబడుతుంది. కేరళ మోడల్ స్థానిక స్వపరిపాలన ప్రపంచ వ్యాప్తంగా అనేక సార్లు ప్రశంసలు అందు కున్నది. కొత్త సంస్కరణ ఒక సమూల- నిర్మాణాత్మక మార్పు అని కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ (కేఐఎల్ఏ) డైరెక్టర్ డాక్టర్ జారు ఎలమోన్ అన్నారు.