Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ హయాంలో 123 శాతం పెరిగిన రుణాలు
- 2023 మార్చి 23 నాటికి 155.3 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా..
న్యూఢిల్లీ : దేశంపై అప్పుల భారం నిరంతరం పెరుగుతోంది, మోడీ పాలనలో అప్పులు 123 శాతంపెరిగాయి.2021 సెప్టెంబర్ నాటికి వరకు కేంద్ర ప్రభుత్వం రూ.125.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని గణాంకాలు చెబుతున్నాయి. 2022-23 అదే బడ్జెట్ అంచనా ప్రకారం 2023 మార్చి 31,నాటికి ఈ రుణం (ప్రస్తుత మారకం రేటు ప్రకారం) రూ.155.3 లక్షల కోట్లకు పెరుగుతుందని పేర్కొంది. ఖజానాలో కాసుల్లేకపోయినా..మోడీ సర్కార్ గమ్మునుండనంటోంది. పార్లమెంట్ భవనాన్ని కాదని, ఆర్భాటాలకు పోయి కొత్త ప్రాజెక్టు ( విస్తారా ) నిర్మాణానికి సిద్ధమైంది. ఇలాంటి మరెన్నో ప్రాజెక్టును కోట్లు గుమ్మరిస్తోంది. అయితే దీనివెనుక కార్పొరేట్ల ఉన్నారన్నది బహిరంగ సత్యమే. ఇలాంటి మరెన్నో కారణాలతో..దేశంపై అప్పుల భారం నానాటికీ పెరిగిపోతోంది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖర్చుల కోసం ఎక్కడెక్కడి నుంచో డబ్బులు సేకరించే పనిలో నిమగమై ఉంది. దీన్ని బట్టి మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ ఆస్తులను విక్రయించగా, మిగిలిన వాటిని అమ్మటానికి ప్రయత్నిస్తోంది. ఖజానా నింపుకోవటానికి అమ్ముకోలేనిది తనఖా పెడుతోంది. మరోవైపు భారీగా అప్పులు చేస్తూనే ఉన్నది. సెప్టెంబర్ 2021 వరకు కేంద్ర ప్రభుత్వం రూ.125.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఇటీవల విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఇది 2021-22 యొక్క సవరించిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 55 శాతం. అంటే, 2021 జనాభా ప్రకారం..సెప్టెంబర్ వరకు తలసరి అప్పు రూ.92,348కి పెరిగింది.
2022-23 బడ్జెట్ గణాంకాల ప్రకారం..2022 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వంపై అప్పు రూ.139 లక్షల కోట్లకు (ప్రస్తుత మారకం రేటు ప్రకారం) పెరుగుతుందనీ, ఆర్థిక వ్యవహారాల శాఖ పేర్కొంది. 2021 సెప్టెంబర్ నాటికి రూ. 125.7 లక్షల కోట్లు అవుతుంది ఈ లెక్కన 2021 నుంచి సెప్టెంబర్ నుంచి 2022 మార్చి 31 వరకు.. ప్రభుత్వం 13.3 లక్షల కోట్ల రుణం తీసుకోబోతోంది. 2022-23 అదే బడ్జెట్ అంచనా ప్రకారం, మార్చి 31, 2023 నాటికి, ఈ అప్పు (ప్రస్తుత మారకం రేటు ప్రకారం) రూ. 155.3 లక్షల కోట్లకు పెరుగుతుంది, అంటే 2022 మార్చి 31 నుంచి 2023 మార్చి 31 మధ్య, ప్రభుత్వం 16.3 లక్షల కోట్ల రుణం తీసుకోనున్నది.
2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేంద్ర ప్రభుత్వంపై మొత్తం రూ.53.1 లక్షల కోట్ల అప్పులు ఉండగా, 2023 మార్చి 31 నాటికి రూ.155.3 లక్షల కోట్లకు చేరనున్నది. మొత్తం మీద మోడీ హయాంలో రూ. 100 లక్షల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించగా, ఇందులో ఇప్పటి వరకు 70 శాతానికి పైగా అప్పుల్ని తీసుకున్నది.2021-22 సవరించిన జీడీపీ ప్రకారం 2021లో దేశ జనాభా తలసరి ఆదాయం రూ. 1,70,528 కాగా తలసరి అప్పు రూ. 1,02,105 అవుతుంది. 2022 అంచనా జనాభా ప్రకారం 2022-23 తలసరి ఆదాయం రూ. 1,87,806 కాగా, తలసరి రుణం రూ. 1,13,055. 2023 మార్చి 31, దేశ ఆదాయం (జీడీపీ)లో 60 శాతానికి పైగా రుణాలే ఉండనున్నాయి.
అప్పునకు వడ్డీ...
ఎవరైనా అప్పు తీసుకుంటే వడ్డీ కట్టాల్సిందే. ఇప్పుడు ఈ రుణంపై ప్రభుత్వం ఏటా ఎంత వడ్డీ ఇస్తుందంటే.. 2020-21లో ప్రభుత్వం రుణంపై వడ్డీరూపంలో.. రూ.6.80 లక్షల కోట్లను చెల్లించినట్టు 2022-23 బడ్జెట్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2021-22 సవరించిన అంచనా ప్రకారం, ప్రభుత్వం రూ. 8.14 లక్షల కోట్ల వడ్డీని, 2022-23లో ప్రభుత్వం రూ. 9.41 లక్షల కోట్ల వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.
మోడీ చేసే అప్పు..సామాన్యుడిపై భారమా..?
ప్రభుత్వం తీసుకుంటున్న రుణం, సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? భవిష్యత్తులో ప్రజలపై ఎంత ప్రభావం చూపబోతోంది.? అనే చర్చ నడుస్తున్నది. సహజంగానే, ప్రభుత్వంపై అప్పులు ఎక్కువ అయినప్పుడు, ప్రభుత్వం ఖర్చును తగ్గిస్తుంది. కొన్ని మార్గాల ద్వారా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించటం సహజం. అయితే మోడీ ప్రభుత్వం గతంలో ఎన్నడూలేనివిధంగా భారాలు మోపి పిండేస్తోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల బడ్జెట్లో ప్రభుత్వం కోత పెడుతోంది. ఇది ప్రజల ఆర్థిక మూలాలపై దెబ్బతీస్తుందని ఆర్థిక వ్యవహారాల నిపుణుడు సుబోధ్ వర్మ అంటున్నారు. 2022-2023లో గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద కేటాయించింది రూ. 73,000 కోట్లు, ఇది గత ఏడాది కేటాయించిన రూ. 98,000 కోట్లతో పోలిస్తే దాదాపు 25 శాతం తక్కువ.ఐసీడీఎస్/అంగన్వాడీ కేటాయింపులు గతేడాది రూ.20,000 కోట్లు కేటాయించగా ఇపుడు రూ.20,263 కోట్లు. ఇది సగటు ద్రవ్యోల్బణం 5 శాతం కంటే ఎక్కువగా కనిపించినా..కేవలం ఒక్క శాతం పెరుగుదల అర్థరహితమని అంగన్వాడీ కేంద్రాల సంఘాలు ఆరోపిస్తున్నాయి.గ్రామీణ గృహాల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గత ఏడాది రూ.20,390 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది రూ.20,000 కోట్లు తగ్గించింది.సబ్సిడీ వంటగ్యాస్ కేటాయింపు కోసం ఉజ్వల పథకం గతేడాది రూ.1,618 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది కేవలం రూ.800 కోట్లకు కుదించింది. ఇలా పలు శాఖలకు కేటాయింపులకు కోతపెట్టింది.గతేడాది ఆరోగ్యమంత్రిత్వ శాఖకు రూ.88,665 కోట్ల నుంచి ఈ ఏడాది రూ.89,251 కోట్లకు పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇది వాస్తవానికి తగ్గింపే. ఇక మొత్తం బడ్జెట్ వ్యయాన్ని పరిశీలిస్తే.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాటా గత ఏడాది 2.35 శాతం నుంచి ఈ ఏడాది 2.26 శాతానికి తగ్గింది. జీడీపీ వాటాగా చూస్తే.. ఇది 0.38 శాతం నుంచి 0.35 శాతానికి తగ్గింది.గత ఏడాది విద్యాశాఖకు రూ.88,002గా ఉన్న ఖర్చు ఈ ఏడాది రూ.104,277కు పెరగనుందని అనిపించినా, ప్రభుత్వ మొత్తం వ్యయంలో గతేడాది 2.33 శాతంగా ఉన్నది. ఈ ఏడాది 2.64 శాతానికి పెరిగింది. జీడీపీ వాటాగా చూస్తే.. విద్యపై ఖర్చు గత సంవత్సరం 0.38 శాతం తో పోలిస్తే ఈ సంవత్సరం 0.40 శాతం తక్కువగా ఉంది.
అనేక ముఖ్యమైన వస్తువులపై సబ్సిడీలు భారీగా కోత పెట్టింది. లాభదాయక సంస్థలు, బడా కంపెనీలు ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం అనుమతించడంతో ఈ అన్ని సందర్భాల్లో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఒకవైపు వైపు బడా పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపు ఇస్తూనే మరోవైపు సామాన్య ప్రజల నుంచి పన్నుల రూపంలో మోడీ ప్రభుత్వం భారీగా దండుకుంటోంది. దానికోసం ప్రభుత్వం ప్రత్యేక వవస్థను రూపొందించింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ జీఎస్టీ. సాధారణ ప్రజలను పన్ను పరిధిలోకి తీసుకువచ్చేందుకు.. 2017 నుంచి దేశంలో జీఎస్టీ అమలవుతోంది. జీఎస్టీ వసూళ్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కానీ 2019లో కార్పొరేట్ పన్నును బీజేపీ ప్రభుత్వం తగ్గించాక.. కార్పొరేట్ పన్ను వసూళ్లు గణనీయంగా తగ్గాయి.
సామాన్యుడి కన్నా..సంపన్నులకే అండ..
సామాన్య ప్రజలకు అవసరమైన వాటికి బడ్జెట్లో కోత పెట్టడమే కాకుండా.. సొంతంగా సంపాదనకు దోహదపడే విధానాన్ని మోడీ ప్రభుత్వం అనుసరిస్తోందని డేటాను బట్టి స్పష్టమవుతోంది. తమకు స్నేహపూర్వక పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపు ఇస్తూ వచ్చింది. అందువల్లే ప్రభుత్వ ఆదాయం పెరగాల్సిన స్థాయిలో పెరగలేదు. దీంతో ఖజానా నింపటమేలా అని తర్జనభర్జన పడుతోంది. దేశప్రజల నెత్తిన ఇప్పటికే అంతులేని భారాలు వేస్తోంది. మరోవైపు రుణాల కోసం మోడీ ప్రభుత్వం పరుగులు దీస్తోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సబ్సిడీ...... కోత (శాతాల్లో)
ఆహారం 28
ఎరువులు 25
పెట్రోలియం 11