Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ, ఏపీ, కర్నాటకకు సీజేఐ సూచన
న్యూఢిల్లీ : కృష్ణానదీ జలాల వాటాకు సంబంధించిన వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సూచించారు. కృష్ణా జలాల వివాదానికి సంబంధించి జనవరి 10న విచారణ సమయంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎఎస్ బోపన్నలు ఇకపై తాము విచారణ జరపబోమని, నూతన ధర్మాసనం ఏర్పాటు చేయాలని సిజెఐను కోరతామని చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం కర్ణాటక సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ ఈ అంశాన్ని సిజెఐ కోర్టులో ప్రస్తావించారు. కేసు విచారణకు ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరారు. ''ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వంతో సామరస్యంగా ఎందుకు పరిష్కరించుకోలేరు'' అని జస్టిస్ ఎన్వి రమణ మూడు రాష్ట్రాలను ప్రశ్నించారు. త్వరలోనే ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.