Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్ : 2008లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో మొత్తం 49 మంది దోషుల్లో 38 మందికి అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. 11మందికి జీవిత ఖైదు విధించింది. ఈ ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఈ ఘటనలో 77 మంది నిందితులను విచారించింది. ఈ నెల 8న విచారణ చేపట్టిన కోర్టు 49 మందిని దోషులుగా, 28 మందిని నిర్దోషులుగా తేల్చింది. సుమారు 13 ఏళ్ల నాటి ఈ కేసు విచారణను సెప్టెంబర్‌తో ముగించిన కోర్టు.. శిక్షను శుక్రవారం ఖరారు చేసింది. ఆన్లైన్ పద్ధతిలో విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం.. దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమ్మెంట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఎంఐ), ఇండియన్ ముజాయిద్దీన్ (ఐఎం) వంటి ఉగ్రవాద సంస్థల కుట్రేనని పోలీసులు తేల్చారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లకు ప్రతీకారంగా ఈ మారణ హోమాన్ని సష్టించారని చెప్పారు. దీనికి సంబంధించిన అన్ని కేసులను విలీనం చేసిన తర్వాత.. 2009 డిసెంబర్లో కోర్టు విచారణ ప్రారంభించింది.
ఆ రోజు ఏం జరిగిందంటే..!
2008న జులై 26న అహ్మదాబాద్‌లోనూ వరుస పేలుళ్లతో మారణహౌమం జరిగింది. జులై 26 సాయంత్రం 6.45గంటలకు మొదలైన ఆ పేలుళ్లు దాదాపు 70 నిమిషాల పాటు కొనసాగాయి. నగరంలోని 14 ప్రాంతాల్లో 21 బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి, మణినగర్, రారుపూర్, బాపునగర్, హఠకేశ్వర్ సర్కిల్, సర్కేజ్, సారంగ్పూర్, జవహర్ చౌక్, ఇసాన్‌పూర్ ప్రాంతాల్లో ఈ వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లోని నివాస, వాణిజ్య, రద్దీ ప్రదేశాలతోపాటు క్షతగాత్రులను చేరవేసే సమీప ఆస్పత్రులను కూడా ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. అందుకు అనుగుణంగానే పేలుళ్లకు టైమింగ్ అమర్చడం గమనార్హం. అధిక స్థాయిలో ప్రాణనష్టం, ప్రజలు, వైద్యుల్ని భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే ఆ ప్రణాళిక రచించినట్లు పోలీసులు గుర్తించారు.
మోడీ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంలో..
ఆ దాడుల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉండగా.. ప్రస్తుత కేంద్ర హౌంశాఖ మంత్రి అప్పుడు గుజరాత్ హౌంమంత్రిగా ఉన్నారు. అయితే, నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహించిన మణినగర్లోనే అధిక పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఇక ఆ ఘటన సమయంలో ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున పరిహారం అందించారు. అయితే, ఈ మారణహౌమానికి తామే కారణమంటూ ఇండియన్ ముజాహిదీన్ ప్రకటించింది. అంతేకాకుండా 2002 నాటి గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగానే వరుస పేలుళ్లకు పాల్పడినట్టు పేర్కొంది.