Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : పంట పొలాల్లో ఎరువులు చల్లడంతో పాటు ఇతర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను మోసుకెళ్లేలా సరికొత్త 'కిసాన్ డ్రోన్ల'ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఒకేసారి 100 కిసాన్ డ్రోన్లను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ విధానాలు సక్రమంగా ఉంటేనే దేశం ఉన్నత శిఖరాలను తాకగలదని అన్నారు. 21వ శతాబ్దపు ఆధునిక వ్యవసాయ విధానం దిశలో ఇదొక కొత్త అధ్యాయమని, ఈ ప్రయోగం డ్రోన్ రంగం అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిరూపించబడమే కాకుండా, అంతులేని అవకాశాల ద్వారాలను తెరుస్తుందని అన్నారు. గరుడ ఏరోస్పేస్ రాబోయే రెండేళ్లలో లక్ష 'మేడ్ ఇన్ ఇండియా' డ్రోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. గత కొన్నేళ్లుగా దేశంలో చోటుచేసుకున్న సంస్కరణలు యువత, ప్రయివేటు రంగం బలోపేతానికి ఊతమిచ్చాయని తెలిపారు.ఈ బడ్జెట్లో చేసిన ప్రకటనల నుండి ఇతర విధాన నిర్ణయాల వరకు, దేశం బహిరంగంగా సాంకేతికత, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. పొలాల్లో పురుగు మందులు చల్లేందుకు కూడా డ్రోన్లను ఉపయోగిస్తున్నారని అన్నారు. కిసాన్ డ్రోన్ ఇప్పుడు ఈ దిశలో నవయుగ విప్లవానికి నాంది అని వ్యాఖ్యానించారు.