Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో సంచలనం రేపిన వ్యాపమ్ కేసులో సీబీఐ 160 మందిపై చార్జీషీటును దాఖలు చేసింది. ఇందులో మూడు మెడికల్ కాలేజీల చైర్మెన్ల పేర్లు ఉన్నాయి. దీంతో ఈ కేసు చార్జీషీటులో పేర్లు నమోదైనవారి సంఖ్య ఇప్పటి వరకు 650కు చేరింది. ఈ చార్జీషీటును వ్యాపమ్ సంబంధిత కేసులను విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టినట్టు సీబీఐ స్పెషల్ ప్రాసిక్యూటర్ సతీశ్ దినకర్ తెలిపారు. మధ్యప్రదేశ్ వ్యాపమ్ మాజీ కంట్రోలర్ పంకజ్ త్రివేదీ, స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఇ)కి చెందిన ఇద్దరు అధికారులతో పాటు మొత్తం 160 మంది పేర్లను చేర్చినట్టు వివరించారు. చిరాయు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పటల్ చైర్మెన్ అజరు గొయెంకా, పీపుల్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పటల్ చైర్మెన్ ఎస్.ఎన్ విజయవర్గీయ, ఇండోర్‌కు చెందిన ఇండెక్స్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పటల్ చైర్మెన్ సురేశ్ సింగ్ భదోరియాల పేర్లు ఉన్నట్టు ఆయన ధ్రువీకరించారు.