Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోనె సంచిలో కుక్కి...
న్యూఢిల్లీ : ఢిల్లీలో అమానుషం చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన 14 ఏండ్ల మైనర్ బాలిక విగత జీవిగా, పాక్షికంగా కుళ్లిన స్థితిలో కనిపించింది. బాలిక మృతదేహాన్ని ఔటర్ ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడి.. అనంతరం గొంతు నులిమి చంపేసినట్టు వెల్లడించారు. డీసీపీ బ్రిజేంద్ర కుమార్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న బాలిక తప్పిపోయినట్టు కేసు నమోదైందని వెల్లడించారు. ఈ నెల 19న ఝాన్సీ నుంచి సన్నోత్ అనే ప్రాంతానికి వచ్చిన రాహుల్ రారు అనే వ్యక్తికి.. తన దుకాణం నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చింది. ఆయన దుకాణంలో పనిచేస్తున్న కార్మికుడు సైతం కనిపించకపోవటంతో అనుమానం మరింత బలపడింది. పోలీసులకు రాహుల్ సమాచారం అందించగా.. షాపు మొత్తం తనిఖి చేయగా..ఓ బ్యాగ్‌లో పేడ మధ్యలో బాలిక మృతదేహం పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో దొరికింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతదేహం దొరికిన ప్రాంతాన్ని క్రైమ్ బ్రాంచ్ బృందం కూడా పరిశీలించింది. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసు బృందాలు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుల్లో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశామని డీసీపీ తెలిపారు. విచారణలో నిందితుడు.. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోరు జిల్లా వాసిగా గుర్తించారు. మైనర్‌కు మాయమాటలు చెప్పి.. తాగి.. బాలికపై దారుణానికి ఒడిగట్టినట్టు ఒప్పుకున్నాడు. ఈ విషయం బయట చెప్పేస్తుందేమన్న భయంతో బాలిక ధరించిన ఫలాజో (దుస్తులు)ను గొంతుకు బిగించి హత్య చేసినట్టు తెలిపాడు. రెండవ నిందితుడి కోసం గాలిస్తున్నట్టు డీసీపీ తెలిపారు.