Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలగించిన ట్విటర్
అహ్మదాబాద్: ఎన్నికలు జరుగుతున్న వేళ.. దక్షిణాదిలో హిజాబ్ తో ఆజ్యం పోస్తే.. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2008లో చోటు చేసుకున్న వరుస పేలుళ్ల పై కూడా రాజకీయ అస్త్రంగా మలుచుకోవాలని బీజేపీ ఎత్తులేస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. 13 ఏండ్ల నాటి పేలుడు కేసులో 38 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఇటీవల ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పుపై గుజరాత్ బీజేపీ ట్విటర్ ఖాతాలో గీసిన కార్టూన్లో.. ఓ వర్గానికి చెందిన వారిని సామూహికంగా ఉరివేస్తున్నట్టు గా ఉన్న ఆ ఫొటో వెనుక జాతీయ జెండాతో పాటు సత్యమేవ జయతే అనే పదాలు రాసి ఉన్నాయి. అయితే ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది. ఓ వర్గం వారిని కించపర్చేలా కార్టూన్‌ను రూపొందించారంటూ బీజేపీ పై విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు దీనిపై సోషల్‌మీడియా సంస్థకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆ పోస్ట్‌ను ట్విటర్ ఖాతానుంచి తొలగించింది.