Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీమా సంస్థలో సరిపడా మూలధనం
- 50వేల కోట్ల పైగా మిగులు నిధులు : ఆ సంస్థ చైర్మెన్ ఎంఆర్ కుమార్
- మార్చి మొదటివారంలో సెబీ అనుమతి..!
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీఓ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. మరోవైపు తమ వద్ద సరిపడ మూలధనం ఉందని ఎల్ఐసీ చైర్మెన్ ఎంఆర్ కుమార్ తెలిపారు. ఐపీఓకు రానున్న ఎల్ఐసీకి విస్తృత ఇన్వెస్టర్లు ఉన్నారు. ఇందులోని 5 శాతం వాటాల విక్రయించనున్నారు. అయితే తమ సంస్థకు మూలధనం అవసరం ఉండబోదని ఎల్ఐసీ విశ్వసిస్తోంది. ఒక వేళ ఎల్ఐసీకి నిధులు అవసరమయితే ప్రభుత్వాన్నే కాకుండా వాటాదారులను కూడా సంప్రదించాలనుకుంటోంది. ఇతర బీమా కంపెనీలతో పోల్చితే తమ సం స్థ ఎల్ఐసీ ్థ భిన్నమైందనీ, ఉద్యోగులు, ఇటు ప్రజలు నమ్ముతారు. పైగా ఎల్ఐసీలో రూ.50,000 కోట్ల పైగా మిగులు నిధులున్నాయి. ఇందులోని 95 శాతం నిధులు కూడా పాలసీదారులకు చెందుతాయని అధికారులు అంటున్నారు. అయితే భవిష్యత్తులో ఈ వాటా 95 శాతం నుంచి 90 శాతానికి తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరోవైపు లాభాలు కూడా మరింత పెరుగుతాయని ఎల్ఐసీ చైర్మెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎల్ఐసీ వెబ్సైట్లో 60-70 లక్షల మంది ఖాతాదారులు తమ పాన్ కార్డును పాలసీలతో అనుసంధానం చేసుకున్నారు.
భవిష్యత్తులో మరిన్ని కొత్త పాలసీలు రానున్నాయి. నాన్ పార్టిసిపేటింగ్ పాలసీల కోసం కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఆందోళనల వల్ల విదేశీ సంస్థాగత మదుపర్లు ఈక్విటీ అమ్మకాలపై మొగ్గు చూపుతున్నారనీ.. ఇది మార్కెట్లపై ప్రభావం చూపించొచ్చని అడిగిన ప్రశ్నకు ఆయన చైర్మెన్ సమాధానమిచ్చారు. తాము ఈ పరిస్థితులను చాలా దగ్గరగా పరిశీలిస్తున్నామని.. చాలా జాగ్రత్తగా ఉన్నామని అన్నారు. ఎల్ఐసీ ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే నెల చివరి కల్లా ఇందులోని 5 శాతం వాటాలను విక్రయించాలని మోడీ సర్కార్ నిర్దేశించుకుంది. కాగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రభుత్వం వాటాలను అమ్మకానికి పెట్టింది. ఇందులో మొత్తంగా 31.6 కోట్ల ఈక్వీటీ షేర్లను విక్రయించనుంది. ఐడీబీఐ బ్యాంక్లో ఎల్ఐసీ, ప్రభుత్వానికి కలిపి 90 శాతం వాటాలున్నాయి.మార్చి మొదటివారానికల్లా సెబీ అనుమతించే అవకాశాలున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ప్రక్రియ జరిగాకే..షేర్ల అమ్మకం విలువను నిర్ణయించనున్నట్టు సమాచారం.