Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలిటిక్స్ టివి వెబ్సైట్, యాప్స్‌ను నిలిపేసిన కేంద్రం
- ఎస్ఎఫ్జెతో సంబంధాలున్నట్లు ఆరోపణ
న్యూఢిల్లీ : పంజాబ్‌లో మంగళవారం ఇంటర్నెట్, డిజిటిల్ వేదికలపై కలకలం చెలరేగింది. నిషేదిత సంస్థ అయిన 'న్యాయం కోసం సిక్కులు' (సిఖ్స్ ఫర్ జస్టిస్-ఎస్ఎఫ్)తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 'పంజాబ్ పాలిటిక్స్ టివీ'కి చెందిన పలు యాప్‌లు, వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాలను కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. పంజాబ్‌తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులను భంగం కలిగించేందుకు ఆన్లైన్ మీడియాను వేదికగా మలుచుకున్నట్లు నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం అందడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. 'నిషేధిత సిక్కు ఫర్ జస్టిస్‌తో సంబంధాలున్న విదేశీ ఆధారిత పంజాబ్ పాలిటిక్స్ టివి యాప్‌లు, వెబ్సైట్, సోషల్ మీడియా ఖాతాలను వినియోగించి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నందున.. దాని యాప్‌లు, వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాలను చట్ట విరుద్ధ కార్యాకలాపాలకు చట్ట విరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం 1967 కింద బ్లాక్ చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకింద ఆదేశించింది' అని ప్రకటించింది.