Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెబీ ఆదేశాలు పట్టించుకోని అంబానీ, అదానీలు..
- నిబంధనల అమలు తప్పనిసరి కాదు..స్వచ్ఛందమేనని వెల్లడి
న్యూఢిల్లీ : భారత్‌లోని బడా కార్పొరేట్ సంస్థలు మోడీ సర్కార్ అండదండలు చూసుకొని నిబంధనల్ని బేఖాతరు చేస్తున్నాయి. 'సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (సెబీ) ఆదేశాల్ని పాటించటం లేదు. దాంతో 'సెబీ' వెనక్కితగ్గి..నిబంధనలను మార్చుకుంది.సెబీ నిబంధనలు అమలుజేయాలా? వద్దా? అన్నది కార్పొరేట్ కంపెనీల ఇష్టం? కచ్చితంగా అమలుజేయాలనేమీ లేదు..అంటూ సెబీ యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. దేశంలో 500కిపై గా బడా కార్పొరేట్ కంపెనీలకు సంబంధించి సెబీ గతంలో కీలక ఆదేశాలు జారీచేసింది. అందులో ఏముందంటే..చైర్పర్సన్ కంపెనీ బోర్డ్‌కు నేతృత్వం వహిస్తాడు,కంపెనీ ఎండీ లేదా సీఈవో మేనేజ్మేం ట్‌కు నేతృత్వం వహిస్తాడు. ఈ రెండు పోస్టుల్లో ఒక్కరే ఉండరాదని సెబీ నిబంధనలు పేర్కొంటున్నా యి.భారత్‌లోని కార్పొరేట్ కంపెనీలు ఛైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్లను వేరు వేరుగా నియమించాలి. కంపెనీ ఎండీ, సీఈవోలకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు చైర్‌పర్సన్‌గా ఉండాలి.ఇందుకు అన్ని కంపెనీలూ సమ్మతి తెలియజేస్తూ..నిబంధనలు తప్పనిసరిగా అమలుజేయాలని, చివరి గడువు ఏప్రిల్ 1,2022గా నిర్ణయించింది. ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్, గౌతం అదానికి చెందిన అదానీ పోర్ట్స్, సంజీవ్ మెహతాకు చెందిన హిందుస్తాన్ లీవర్, సజ్జాన్ జిందాల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ స్టీల్...మొదలైన కంపెనీలకు సెబీ ఆదేశాలు రుచించలేదు. దేశంలో దాదాపు 150కిపై గా కార్పొరేట్ కంపెనీలకు ఎండీ, చైర్పర్సన్స్లుగా ఒక్కరే ఉన్నారు. కార్పొరేట్ పాలనలో పారదర్శకత, విశ్వసనీయతను పెంచాలనే లక్ష్యంలో భాగంగా సెబీ ఆదేశాలు వెలువడ్డాయి. ఐదేండ్ల క్రితం రూపొందిన ఈ నిబంధనల్ని కచ్చితంగా అమలుజేయాలని మార్కెట్ నియంత్రణా సంస్థ అయిన 'సెబీ' ఎన్నో ఏండ్లుగా ప్రయత్నిస్తోంది. అయితే వీటిని బడా కంపెనీలు పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవ టంతో..తరుచూ డెడ్‌లైన్ మార్చుతోంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి సెబీకి ఆదేశాలు వెళ్లాయి. కార్పొరేట్ వర్గాలను ఇబ్బంది పెట్టొందని చెప్పారట! దాంతో నిబంధనల్ని సెబీ సమూలంగా మార్చేంది. కంపెనీల పాలనపై ఇచ్చిన ఆదేశాలు అమలుజేయటం..కంపెనీల ఇష్టం, లేదంటే లేదు..అని సెబీ తాజాగా పేర్కొనటం చర్చనీయాంశమైంది.