Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోలుకున్నా ఇంకా బాధిస్తునే ఉంది : సీజేఐ జస్టిస్ రమణ
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు భౌతిక విచారణలకు హాజరవ్వాలన్న అభ్యర్థనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఒమిక్రాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అన్నారు. ఒక నెల క్రితం ఈ వేరియంట్ భారినపడ్డాననీ, కోలుకున్న తరువాత కూడా తాను ఆ వేరియంట్ ప్రభావంతో ఇంకా బాధపడుతునే ఉన్నానని తెలిపారు. అంతేకాదు తాను కరోనా మొదటి వేవ్‌లోనే కరోనా వైరస్ భారిన పడ్డాననీ, నాలుగు రోజుల్లో కోలుకున్నానని, మళ్లీ ఇప్పుడు ఈ వేవ్‌లో భారిన పడి బయటపడినా.. 25 రోజులుగా బాధపడుతూనే ఉన్నానని అన్నారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో పూర్తి భౌతిక విచారణను ప్రారంభించాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌కు నేతృత్వం వహిస్తున్న సీని యర్ న్యాయవాది వికాస్ సింగ్ అభ్యర్థించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వారానికి రెండుసార్లు భౌతిక విచారణలు, మిగిలినవి ఆన్లైన్లో జరుగుతున్నాయి.