Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వింత షరతులు
- గుర్తింపునకు నోచుకోని ఆరోగ్య కార్యకర్తల
- పీఎంఎంవీవైపై మోడీ సర్కారు తీరు
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి మాతృవందన యోజన (పీఎంఎంవీవై) బడ్జెట్ 2022-23లో తక్కువ ఆర్థిక కేటాయింపులతో వార్తల్లో నిలిచింది. 2017లో ప్రారంభమైన ఈ పథకం ప్రస్తుతం మిషన్ శక్తి కింద ఏకీకృతం చేయబడింది. తల్లి, శిశు ఆరోగ్య సంబంధిత ప్రవర్తనను మెరుగుపరచడం, ఆదాయ నష్టానికి పాక్షిక పరిహారం అందించడం ఈ పథకం లక్ష్యం. దీంతో తల్లి తిరిగి తన పనిలో చేరే ముందు తగిన విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది. దీంతో తల్లి, పుట్టబోయే శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటానికి ఇది పరోక్షంగా దోహదపడుతుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగులు, మరేదైనా చట్టం ప్రకారం ఇలాంటి ప్రయోజనాలను పొందేవారు ఈ పథకం నుంచి మినహాయించిబడ్డారు. ఇలాంటి పథకానికి మోడీ సర్కారు బడ్జెట్లో కోతలు విధించడమే కాకుండా వింత షరతులు పెడుతున్నది. రెండోసారి గర్భం దాల్చిన వారికి కూడా నగదు సాయం అందుతుందనీ, అయితే కేవలం ఆడపిల్లకు మాత్రమే అని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించడం ఇప్పుడు వివాదాన్ని రేపుతున్నది. భారతదేశంలో పుట్టబోయే బిడ్డ లింగనిర్ధారణ చట్టవిరుద్ధం. అయితే, మొదటి రెండు వాయిదాల పంపిణీకి రెండో బిడ్డ లింగాన్ని ఎలా నిర్ధారిస్తారో స్పష్టత లేదు. ఇది గందరగోళంగా తయారైంది.
సామాజిక ఆరోగ్యకార్యకర్తల పాత్ర
ఈ వివాదాలున్నప్పటికీ పీఎంఎంవీవై, జననీ సురక్ష యోజన (జేఎస్వై) రెండింటిలో కీలకమైన అంశం..2005లో ప్రారంభించబడిన మొదటి తరం ప్రసూతి షరతులతో కూడిన నగదు బదిలీ పథకం. ఇది ఆరోగ్య సంరక్షణ సంస్థలో డెలివరీ కోసం రూ. 1000 అందిస్తుంది. అయితే ఇది నిర్లక్ష్యానికి గురైంది. ఈ పథకాలను విజయవంతం చేయడంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (సీహెచ్డబ్లూ) కీలక పాత్ర పోషిస్తున్నారు.
భారతీయ ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థలో మూడు ప్రధాన రకాలైన సీహెచ్‌డబ్ల్యూలు ఉన్నాయి. సహాయక నర్స్ మిడ్వైఫ్ (ఏఎన్ఎం), అంగన్వాడీ కార్యకర్తలు (ఏడబ్ల్యూడబ్ల్యూ), 2005లో ఇటీవలి అక్రిడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్‌లు (ఆశా). సీహెచ్‌డబ్ల్యూలు గర్భిణీ స్త్రీలను ప్రసవానికి సిద్ధం చేయడానికి కీలకమైన ప్రసూతి ఆరోగ్య సేవలను అందజేస్తున్నారు. అనేక మంది తల్లుల, శిశు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై సకాలంలో సమాచారాన్ని అందజేస్తున్నారు. అయితే, వారి సహకారం మాత్రం గుర్తింపునుకు నోచుకోకపోవడం గమనార్హం.
ఈ సీహెచ్‌డబ్ల్యూలు ప్రోగ్రాంల కింద తల్లులను నమోదు చేయడానికి బాధ్యత వహిస్తాయి. అదనంగా, వారు సంస్థాగత డెలివరీ, తల్లిపాలు, రోగనిరోధకత, జనన నియంత్రణ పద్ధతులకు సంబంధించిన సలహాలను కూడా అందిస్తారు. తల్లి, పిల్లల ఆరోగ్య ఫలితాలపై వీరి ప్రభావం కనబడుతుంది.
సీహెచ్‌డబ్ల్యూల సేవలపై సమాచారం
సీహెచ్‌డబ్ల్యూలు పోషించే పాత్రను అర్థం చేసుకోవడానికి 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్-4) నాలుగో రౌండ్ ప్రకారం.. వారు తల్లులను సందర్శించడం, ప్రజారోగ్య కేంద్రంలో ప్రసవించిన వారికి వారి ఆరోగ్య సలహాల గురించి సమాచారాన్ని సేకరించారు. యూపీ, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అసోం, రాజస్థాన్, ఒడిశా, జమ్మూకాశ్మీర్, భారతదేశంలోని పది తక్కువ-పనితీరు రాష్ట్రాలలో (ఎల్పీఎస్) 50,076 తల్లి-శిశు జంటల నమూనా ఏర్పడింది. జేఎస్వై దృష్టి 10 తక్కువ-పనితీరు గల రాష్ట్రాలపై ఉన్నది. ఎందుకంటే, ఈ పథకం ప్రారంభమైనప్పుడు 2005లో ఇంట్లోనే నాలుగు ప్రసవాలలో కనీసం మూడు ప్రసవాలు జరిగాయి. పీఎంఎంవీవై లబ్దిదారుల డేటా ఎన్ఎఫ్హెచ్ఎస్లో సేకరించబడినందున సంస్థాగత డెలివరీ కోసం అందుకున్న ఆర్థిక సహాయంపై దృష్టి ఉంటుంది. (వీరిలో 95 శాతం మంది జేస్వై లబ్దిదారులు). ఇలాంటి పథకాలకు మోడీ సర్కారు ఇప్పటికైనా బడ్జెట్లో కేటాయింపులు జరపాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆరోగ్య కార్యకర్తలను శ్రమను గుర్తించి వారికి తగిన ప్రతిఫలం దక్కేలా చూడాలని తెలిపారు.