Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్టు పుతిన్ ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర గురువారం 100 డాలర్లను దాటింది. సుమారు ఏడేళ్ల అనంతరం అత్యధిక ధర నమోదవడం గమనార్హం. 2014వ సంవత్సరం తర్వాత తొలిసారిగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరాయి. 2014వ సంవత్సరంలో ముడిచమురు బ్యారెల్ ధర 100 డాలర్లను అధిగమించింది. ఇంధనంతోపాటు గోధుమలు, లోహాల ధరలు పెరగనున్నట్లు సమాచారం. ఇటీవల కరోనా లాక్ డౌన్ల అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. రష్యా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. ఇది ప్రధానంగా యూరోపియన్ రిఫైనరీలకు ముడి చమురును విక్రయిస్తుంది. మార్కెట్ ఇన్వెస్టర్లు వేగంగా సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అందుకే బంగారం, డాలర్లు, జపాన్ యెన్ వంటి వాటి ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆసియా స్టాక్ మార్కెట్లు 2 నుండి 3 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 1432.50 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 410.70 పాయింట్లు నష్టపోయింది. బిఎస్ఇ సెన్సెక్స్ ఉదయం 9 గంటల సమయంలో 1432.50 పాయింట్లు లేదా 2.50 క్షీణించి 55,795 వద్ద ట్రేడవుతోంది. అలాగే నిఫ్టీ 410.70 పాయింట్లు లేదా 2.41 శాతం క్షీణించి 166652.60 వద్ద ట్రేడవుతోంది.
నేడు మరోసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి మరోసారి అత్యవసరంగా సమావేశం కానుంది. మూడు రోజుల వ్యవధిలో రెండవసారి అత్యవసర సమావేశం నిర్వహించడం గమనార్హం. సైనిక మోహరింపు, తదితర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుందని దౌత్యవర్గాలు తెలిపాయి.
ఉక్రెయిన్ అభ్యర్థన మేరకు పశ్చిమ భద్రతా మండలి సభ్యుల మద్దతుతో బుధవారం రాత్రి 9.30గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం 2.30 గంటలకు) షెడ్యూల్ చేయబడిందని ఆ వర్గాలు తెలిపాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాదులు రష్యా సైనిక సహాయాన్ని అభ్యర్థించారని, రష్యా దాడితో తక్షణ ముప్పు ఉందని ఐరాసలోని ఉక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లిత్సా లేఖలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌కు ప్రాతినిథ్యం వహించాలని ఆయన కోరారు. అలాగే ఐరాస జనరల్ కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఈ పరిస్థితిపై సూచనలివ్వాలని అభ్యర్థించారు. సోమవారం జరిగిన అత్యవసర సమావేశం మాదిరిగా ఈ సమావేశానికి కూడా ప్రస్తుత భద్రతా మండలి అధ్యక్షుడైన రష్యా దౌత్యవేత్త అధ్యక్షత వహించనున్నారు.