Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెలువడిన పలు వరుస ట్వీట్లు
- రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో క్రిప్టోకర్సెన్సీ డొనేషన్లకు అభ్యర్థన
న్యూఢిల్లీ : బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురైంది. హ్యాక్ అయిన అతని ట్విట్టర్ ఖాతా నుంచి వరుస ట్వీట్లు వెలువడ్డాయి. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య కొనసాగుతున్న యుద్ధం పేరుతో హ్యాకర్లు నడ్డా ట్విట్టర్ ఖాతా నుంచి క్రిప్టోకరెన్సీ డొనేషన్లు కోరుతూ ట్వీట్ చేశారు. ఆయన ఖాతా నుంచి తొలి ట్వీట్ ఆదివారం ఉదయం 10.02 గంటలకు వెలువడింది. రష్యా ప్రజల వైపు నిలబడదామంటూ క్రిప్టో కరెన్సీ డొనేషన్ల కోసం అభ్యర్థిస్తూ ఆ ట్వీట్లో ఉన్నది. ఇంగ్లీషుతో పాటు హిందీలో ఈ ట్వీట్లు చేశారు. బిట్కాయిన్లు, యుతేరియమ్కు సంబంధించి రెండు లింక్‌లనూ అటాచ్ చేశారు. మొదటి ట్వీట్ వెలువడిన కొద్ది సమయానికి రెండో ట్వీట్ వచ్చింది. ''క్షమించండి. నా ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురైంది. రష్యాకు డొనేషన్ అవసరమున్నందున మనం వారికి డొనేట్ చేయాలి'' అని అందులో ఉన్నది. దీంతో ఆయన ఫాలోవర్లలో గందరగోళం నెలకొన్నది. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు స్పందించారు. నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాకుకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉన్నది.