Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెంట్రల్ సెక్రెటేరియట్ సర్వీస్ సిబ్బంది నిరసన
న్యూఢిల్లీ : గత ఆరేండ్లుగా ప్రమోషన్లలో జరుగుతున్న జాప్యంపై సెంట్రల్ సెక్రెటేరియట్ సర్వీసుకు చెందిన వెయ్యికి పైగా సిబ్బంది నార్త్ బ్లాక్లో నిరసనకు దిగారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్తో సమావేశానికి డిమాండ్ చేశారు. అయితే, కేంద్ర మంత్రి మాత్రం ఆయన కార్యాలయంలో లేరు. దీంతో కేంద్ర మంత్రి కార్యాలయం.. నిరసన చేస్తున్న సెంట్రల్ సెక్రెటేరియట్ సర్వీసు సిబ్బందితో మాట్లాడింది. మార్చి 10 వరకు సమస్యలు పరిష్కారమవుతాయని వారికి హామీనిచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్న కారణంగా ప్రమోషన్లలో జాప్యం ఏండ్లుగా జరుగుతున్నట్టు వివరించాయి. '' సుప్రీంకోర్టులో ప్రమోషన్లకు సంబంధించిన కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఆరేండ్లుగా ప్రమోషన్లలో జాప్యం జరుగుతున్నది. ఇతర కేంద్ర ప్రభుత్వ కేడర్లకు సంబంధించి వాటి కేసులలో కోర్టు తుది తీర్పునకు అనుకూలంగా పూర్తి వేగంతో ప్రమోషన్లు జరుగుతున్నాయి'' అని సీఎస్ఎస్ ఫోరమ్ మీడియా అడ్వైజర్ గోమేశ్ కుమావత్ తెలిపారు.