Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి విభాగంలో ఉన్న ఫిన్‌టెక్ కంపెనీ మొబిక్విక్ మార్కెట్లో భారీ వృద్థిపై దృష్టి పెట్టినట్లు పేర్కొంది. బై నౌ, పే లేటర్ (బిఎన్ఫిఎల్) రంగం భారత్‌లో 2026 నాటికి 45-50 బిలియన్ డాలర్ల (రూ.3.75 లక్షల కోట్లు) మార్కెట్‌గా ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది. వృద్థిలో భాగంగా టియర్ 1,2,3 నగరాలు, పట్టణాల్లోని యువత రుణావసరాలను తీర్చలని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తమ సంస్థకు 2.4 కోట్ల మంది వినియోగదారులున్నారని తెలిపింది. లావాదేవీల పరిమాణం పరంగా 157 రెట్ల వద్ధిని నమోదు చేసినట్లు పేర్కొంది.