Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజాపూర్లో ఎదురుకాల్పులు
- మావోయిస్టు అగ్రనేత భార్య మృతి?
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి/చర్ల
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లాలోని మరైట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. కాగా, ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించగా, మరికొందరు పారిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే, మరణించిన మహిళా మావోయిస్టుల్లో ఒకరు మావోయిస్టు పార్టీకి చెందిన ఒక అగ్రనేత భార్యగా పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. కేంద్ర కమిటీకి చెందిన అగ్రనేత భార్యగా వారు అనుమానిస్తున్నారు. కాగా, పూర్తి వివరాలింకా అందాల్సి ఉన్నదని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పెద్ద సంఖ్యలోనే ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనపరుచుకున్నట్టు ఆయన చెప్పారు.