Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్యానా : హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మొండి వైఖరి వేలాదిమంది మహిళలు రాత్రి సమయంలోనూ రోడ్డుపై ఆందోళన చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది. వేతనాలు పెంచాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని 81 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె చేస్తున్నా హర్యానాలోని బిజెపి ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోగా, మొండిగా వ్యవహరిస్తోంది. దీంతో, ఈ నెల 14నుంచి సిఎం అసెంబ్లీ నియోజకవర్గం కర్నాల్‌లో ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో బిజెపి ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద నిరవధిక ఆందోళనలు చేస్తున్నారు. రాత్రి సమయంలో సైతం అక్కడే ఆందోళన కొనసాగిస్తున్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని సిపిఎం డిమాండ్ చేసింది.