Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భుపేష్ బాఘేల్లతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు, మార్చి 10న ఫలితాల వెల్లడి తరువాత అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్షించారు. అలాగే పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌పైనా చర్చలు జరిపారు. ఈ విషయాలను సమావేశం తరువాత ఇద్దరూ ముఖ్యమంత్రులు మీడియాకు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీకానున్న రాజ్యసభ స్థానాలు గురించి కూడా చర్చించారు. అలాగే, తమ రాష్ట్రంలోని పాత పెన్షన్ స్కీము అమలకు నిర్ణయం తీసుకోవడంపై చర్చించినట్లు అశోక్ గెహ్లాట్ తెలిపారు.
కాగా, రాజస్థాన్‌లోని విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఉద్దేశించిన బొగ్గు బ్లాకులకు అనుమతి ఇవ్వడంలో చత్తీస్గడ్ ప్రభుత్వం చేస్తున్న జాప్యం గురించి కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అయితే దీని గురించి ముఖ్యమంత్రులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే ఈ అనుమతులు త్వరగా లభించేవిధంగా జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీగా గెహ్లట్ గత డిసెంబరులో లేఖ రాసారు.