Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా : ఆవును చంపాడని ఆరోపిస్తూ బీహార్లోని అధికార పార్టీ జనతాదళ్ (యు)కి చెందిన ముస్లిం యువకుడిని దారుణంగా కొట్టి హత్య చేస్తే, అలాంటిదేమీ లేదు.. తీసుకున్న రుణం ఎగవేసినందుకే అతనిని హత్య చేశారని బీహార్ పోలీసులు మాట మారుస్తున్నారు. రాష్ట్రంలోని సమస్థిపూర్లో ఈ నెల 16న మహమ్మద్ ఖలీ ఆలంను కొంతమంది దారుణంగా కొట్టి చంపారు. ఆలంను గోవధ గురించి దుండగులు ప్రశిస్తూ, దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నెల 17న సగం కాలిన ఆలం మృతదేహాన్ని బుధి గండక్ నది ఒడ్డున పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఎలాంటి మత కోణం లేదని బీహార్ పోలీసులు తాజాగా చెబుతున్నారు. అప్పు ఎగవేసినందుకే అలామ్ను కొట్టి చంపారని తెలిపారు. నిందితులు ఈ మేరకు వాగ్మూలం కూడా ఇచ్చారని చెప్పారు. ఆలం మృతితో తమకు న్యాయం చేయాలని అతని కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.