Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న మేకేదాటు రెండో దశ పాదయాత్రకు భారీ స్పందన లభిస్తుండటం అధికార బీజేపీకి ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం రామనగరం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర మార్చి 3న బెంగళూరుకు చేరుకోనుంది. మేకేదాటు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ ఈ పాదయాత్ర చేపడుతోంది. రాష్ట్రం, కేంద్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నా మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతులు రావడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో బెంగళూరుకు తాగునీరును కూడా అందిచవచ్చనని చెపుతున్నారు. ఈ పాదయాత్రలో రైతులతో పాటు, సామాన్య ప్రజలు కూడా పాల్గొంటున్నారు. దీంతో బీజేపీ హైకమాండ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ పాదయాత్రతో కాంగ్రెస్‌కు ఎలాంటి రాజకీయ ప్రయోజనం లభించకూడదని హెచ్చరించింది. అలాగే పాదయాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుండటంతో దీనిపై ఎలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటుంది.