Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించనున్న ఏచూరి
తిరువనంతపురం : సీపీఐ(ఎం) కేరళ 23వ రాష్ట్ర మహాసభ కొచ్చిలో మంగళవారం ప్రారంభం కానుంది. మార్చి 4 వరకూ జరిగే ఈ మహాసభ కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ మహసభలో సుమారు 450 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. వీరిలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, 23 మంది పరిశీలకులు కూడా ఉన్నారు. ఈ మహాసభలో పార్టీ వ్యవస్థాగత అంశాలతో పాటు నూతన కేరళ అభివృద్ధి గురించి కూడా చర్చించనున్నట్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ చెప్పారు. మంగళవారం ఉదయం ముందుగా పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మహాసభను ప్రారంభించనున్నారు. ప్రారంభ కార్యక్రమం తరువాత 12:15 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ రాజకీయ సంస్థాగత నివేదిక సమర్పించనున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు 'నవ కేరళం' అనే పాలసీ డాక్యుమెంట్ను కేరళ ముఖ్యమంత్రి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ ప్రవేశపెట్టనున్నారు.