Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ దాడులు చేస్తుందా.. !
ముంబయి : బీజేపీ యేతర ప్రభుత్వాలైన పశ్చిమబెంగాల్, మహా రాష్ట్రలపై కేంద్రం ప్రత్యేకంగా ఎంపిక చేసి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం దర్యాప్తు సంస్థలైన ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలో దాడులు చేయించిందని, త్వరలో మహారాష్ట్రలో కూడా ఎన్నికలు నిర్వహించనున్నందున.. ఇక్కడ కూడా దాడులు జరగడం సాధారణమేనని పరోక్షంగా కేంద్రానికి చురకలంటించారు. దర్యాప్తు సంస్థలు మోడీ ప్రభుత్వానికి ప్రచారాస్త్రాలుగా మారాయనీ, అయితే వారికి శివసేన తలవంచదని అన్నారు. ఈడీ అధికారులు బీజేపీకి ఏటీఎం యంత్రాల్లాగా మారారని అన్నారు. కొంతమంది ఈడీ అధికారులు బీజేపీ టికెట్‌పై ఎన్నికలలో పోటి చేస్తున్నారనీ, ఆ అధికారి 50 మందికి ప్రచార ఖర్చు కూడా పెట్టారని అది తనకు తెలుసునని అన్నారు. రాష్ట్ర మంత్రులైన ఆదిత్యథాకరే, అనిల్ పరబ్‌లపై ఐటీ వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. శివసేన ఆఫీస్ బేరర్, షిర్డీ ట్రస్ట్ సభ్యుడు, ఆధిత్య థాకరే సన్నిహితుడైన రాహుల్ కనల్ నివాసంపై మంగళవారం ఐటీ దాడులు చేపట్టినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.