Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీలాపడ్డ కాంగ్రెస్, ఎస్ఏడీ
- రెండు స్థానాలకే బీజేపీ పరిమితం
న్యూఢిల్లీ : పంజాబ్‌ను ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఊడ్చేసింది. ప్రధాన పార్టీలను పక్కకు నెట్టి ప్రజలు ఆప్‌కు పట్టం కట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మెజార్టీని చెరిపేసి, ఆప్‌కు మరింత మెజార్టీని ప్రజలు ఇచ్చారు. కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ)లు డీలా పడ్డాయి. బీజేపీ కేవలం రెండు స్థానాలకే పరిమితం అయింది. గత ఎన్నికల్లో ఆప్ 20 స్థానాలను గెలుచుకోగా, ఈసారి ఏకంగా 92 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఏకంగా 72 స్థానాలను పెంచుకోగలిగింది. గత ఎన్నికల్లో ఆప్ 23.7 శాతం ఓట్లు సొంతం చేసుకోగా, ఇప్పుడు ఏకంగా 42 శాతం ఓట్లు ఎగబాకింది. దాదాపు 19 శాతం ఓట్లు పెరిగాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 77 స్థానాలను గెలుచుకోగా, ఈసారి 18 స్థానాలకు పరిమితం అయింది. కాంగ్రెస్ ఏకంగా 59 స్థానాలను కోల్పోయింది. గత ఎన్నికల్లో 38.5 శాతం ఓట్లు రాగా, 23 శాతం ఓట్లు వచ్చాయి. దాదాపు 15 శాతం ఓట్లు కోల్పోయింది. శిరోమణి అకాలీ దళ్ గత ఎన్నికల్లో 15 స్థానాలు గెలవగా, ఈసారి కేవలం మూడు స్థానాలకే పరిమితం అయింది. గత ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు రాగా, 18.4 శాతం ఓట్లు వచ్చాయి.