Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఫలితాల నుంచి నేర్చుకుంటాం : రాహుల్‌గాంధీ
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర భంగపాటు ఎదురైంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని తెలిపారు. ''ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈ ఎన్నికల కోసం పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, వాలంటీర్లకు కృతజ్ఞతలు. ఈ ఫలితాల నుంచి మేం నేర్చుకుంటాం. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తా''మని ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటామన్నారు.