Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త నిబంధనలతో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
న్యూఢిల్లీ : విద్యుత్ వినియోగదారులపై భారాలు మోపేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. విద్యుత్ చట్టసవరణ బిల్లు-2020కు పార్లమెంట్ ఆమోదం పొందకపోయినా దొడ్డిదారిలో భారాలు మోపుతోంది. ప్రతి నెల ట్రూ అప్ భారం ప్రజలపై మోపేందుకు కొత్త నిబంధనను కేంద్రప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ మేరకు విద్యుత్ నిబంధన చట్టం-2005లోని నిబంధనలు మారుస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 29వ తేదితో విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను తన వెబ్సైట్లో ఆలస్యంగా పొందుపరిచింది. ఈ నోటిఫికేషన్లో ట్రూఅప్ భారాన్ని నెలనెల వసూలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ అడ్జస్ట్మెంట్ సర్చార్జ్(ఎఫ్పీపీఏఎస్) పేరుతో దీనిని అమలు చేయాలని కేంద్రం పేర్కొంది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుతున్నట్లే ఇక కరెంట్ చార్జీలు నెలకొక్కసారి పెరుగుతుందన్న మాట. ప్రస్తుతం డిస్కంలు మూడు నెలలకోసారి చేసిన ఖర్చు ఆదాయంలో రాకపోతే ట్రూఅప్ భారాలు వేసేందుకు అనుమతి ఇవ్వాలని ఈఆర్సీకి ప్రతిపాదిస్తున్నాయి. డిస్కంల ప్రతిపాదనపై ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి ట్రూఅప్ భారం వేయాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటుంది. ఈ ట్రూప్ చార్జీలు ప్రజలపై మోపేందుకు విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)ని సంప్రదించాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. దీంతో ఇక నుంచి ప్రతి నెల వినియోగదారులకు తెలియకుండానే భారాలు పడనున్నాయి.