Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక బీజేపీ నాయకుడి ప్రకటన
బెంగళూరు: మేలో జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటుకు రూ 6 వేలు ఇస్తామని ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి ప్రకటించారు. రూ. 6 వేలు ఇవ్వకపోతే, తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయవద్దని కూడా పిలుపునిచ్చారు. బెళగావిలోని సులేబావి గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ రమేష్ జార్కిహోళి ఈ విషయాన్ని వెల్లడించారు. 'మేం మీకు రూ. 6వేలు ఇవ్వకపోతే మా అభ్యర్థికి ఓటు వేయవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను' అని మాజీ మంత్రి చెప్పారు. బెళగావి జిల్లాలోని గోకాక్ నియోజకవర్గం నుంచి రమేష్ జార్కిహోళి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే జిల్లాలోని బెళగావి గ్రామీణం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్కు చెందిన లక్ష్మీ హెబ్బాల్కర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. లక్ష్మీ హెల్బాల్కర్ గురించి మాట్లాడుతూ రమేష్ జార్కిహోళి ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఆమె నియోజకవర్గంలో తన ఓటర్లకు బహుమతులు పంచుతున్నట్లు తెలుస్తుంది. ఆమె ఇప్పటి వరకూ రూ. 1000, రూ. 3000 విలువైన కుక్కర్, మిక్సీ వంటి వస్తువులు ఇచ్చి ఉండవచ్చు. మేం ఓటుకు రూ. 6 వేలు ఇస్తాం' అని రమేష్ జార్కిహోళి బహిరంగంగా ప్రకటించారు. ఒక సెక్స్ స్కామ్లో చిక్కుకోవడంతో 2021లో బలవంతంగా జలవనరుల మంత్రి పదవీకి రమేష్ రాజీనామా చేశారు.