Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అదానీ ఆర్థిక కుంభకోణాలకు పాల్పడినట్లు హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో జెపిసి ఏర్పాటు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యాన సోమవారం ఆందోళనలు నిర్వహించారు. ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యాన జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేశారు. జమ్ములో వందలాదిమంది కార్యకర్తలు బారికేడ్లు తోసుకుంటూ ఆందోళన చేశారు. ప్రతిపక్షాలపై దాడులకు వినియోగిస్తున్న సిబిఐ, ఇడి, ఐటి, సెబీ ఎక్కడున్నాయి? అదానీ ఆస్తులపై దాడులెందుకు చేయరు? అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మణిపూర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు.