Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీపీఐ ఎంపీ డి రాజాకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘ కార్యకర్త అయిన తన కుమార్తె ప్రాణానికి ముప్పు వుందంటూ తనకు శుక్రవారం రాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చిందని ఆయన చెప్పారు. హిందీలో మాట్లాడిన ఆ వ్యక్తి బీజేపీ, ఏబీవీపీపై ఎందుకు పోరాడుతున్నారంటూ తనను ప్రశ్నించాడని తెలిపారు. యూనివర్శిటీ విద్యార్థి అయిన తన కుమార్తెను కాల్చి చంపుతామని బెదిరించారన్నారు. ఆస్ట్రేలియాలోని ఒక వ్యక్తి నుండి కూడా తనకు ఇలాగే కాల్ వచ్చిందని, ఆ వ్యక్తి తనకు తాను మాఫియా డాన్‌నని చెప్పుకున్నాడని అన్నారు. ఈ బెదిరింపుల గురించి హోం మంత్రికి తెలియచేశానన్నారు.