Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
- పాఠశాల కరస్పాండెంట్, కో-ఆర్డినేటర్ అరెస్ట్
చండీగఢ్ : హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ జిల్లాలో జరిగిన మైనర్ బాలుడి హత్య ఉదంతంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీబీఎస్ఈని ఆదేశించింది. కాగా, తన కుమారుడి హత్య కేసును ఛేదించడంలో పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవ హరిస్తున్నారని, కీలక నిందితులను వదిలిపెట్టి దర్యాప్తు చేపట్టారని తండ్రి వరుణ్ ఠాగూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈకేసు దర్యాప్తు బాధ్యతలను సీబీసీఐడీకి అప్పగించాలని పిటిషన్లో అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం, సీబీఎస్ఈలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసుపై సర్వోన్నత ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి పై ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈనెల10న గుర్గావ్లోని రెయాన్ అంతర్జాతీయ పాఠశాలలో ఏడేండ్ల బాలుడు అనుమానాస్పద స్థితి లో మృతి చెందిన సంగతి తెలిసిందే. స్కూల్ బస్సు కండక్టరే ఆ విద్యార్థిని హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కండక్టర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ఘటన జరిగిన రోజున మృతుడి తరుఫు బంధువులు, తల్లిదండ్రులు పాఠశాల భవనం ముందు ధర్నాకు దిగారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈహత్య కేసును సీబీసీఐడీతో విచా రణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో ఆ పాఠశాల కరస్పాండెంట్ ఫ్రాన్సిస్ థామస్, కో-ఆర్డినేటర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ హెడ్ జీయస్ థామస్‌లను అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు. నిందితులపై జ్యువెనైల్ యాక్ట్‌లోని సెక్షన్75 ప్రకా రం కేసు నమోదు చేశామని అన్నారు. కాగా, ఇంట రాగేషన్కు హాజరయ్యేందుకు నిరాకరించిన ప్రిన్సి పాల్ సొమ్మసిల్లి పడిపోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించామని అన్నారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత అరెస్ట్ చేయనున్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇదిలా ఉండగా, విద్యార్థుల పట్ల యాజమాన్యాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆం దోళన చెందుతున్నారు. గుర్గావ్లోని అన్ని పాఠశా లల్లో భద్రతా ప్రమాణాలను పెంపొందించడంపై దృష్టి కేంద్రీకరించనున్నట్టు మానవ వనరుల మంత్రి జయదేవకర్ తెలిపారు. రెయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు చెలరేగిన అల్లర్లను నియంత్రించ డంలో విఫలమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్ధార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశామన్నారు.