Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండీగఢ్: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ( డేరా బాబా ) అరెస్టు అనంతరం డేరా చీఫ్ పగ్గాలు ఎవరికి కట్టబెట్టాలనే సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడినట్టు తెలుస్తోంది. ఇద్దరు సాధ్వీలపై లైంగికదాడికి పాల్పడ్డ కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా స్థానంలో డేరా చీఫ్‌గా ఆయన కుమారుడు జస్మీత్ పగ్గాలు చేపట్టనున్నారు. దీనికి గుర్మీత్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. డేరా బాబా కీలక సహాయకుడు దిల్వర్ ఇన్సాన్‌ను శుక్రవారం సోనిపేట్‌లో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆమె కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా, ఇద్దరు సాధ్వీలపై లైంగికదాడి పాల్పడ్డ కేసులో సీబీఐ కోర్టు గతనెల25న గుర్మిత్ బాబాను దోషిగా తేల్చింది. ఈనేపథ్యంలో పంచకుల నగరంలో హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 40 మంది మృతి చెందారు.మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈకేసులో ప్రదీప్ గోయల్ ఇన్సాన్, ప్రకాశ్ అలియాస్ విక్కీ, ఆదిత్య అనే కీలక నిందితులను అరెస్ట్ చేసినట్టు పంచకుల డీసీపీ మన్బీర్సింగ్ తెలిపారు.