Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ఇన్సాన్ను హర్యానా పోలీసులు మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చారు. పంచకుల, సిర్సా అల్లర్ల వెనుక హస్తమున్న మొత్తం 43మంది మోస్ట్ వాంటెడ్ నిందితుల జాబితాను తాజాగా విడుదల చేశారు. ఈ జాబితాలో హనీప్రీత్ అగ్రస్థానంలో ఉండగా, డేరా ప్రతినిధి ఆదిత్య ఇన్సాన్ రెండో స్థానంలో ఉన్నారు. డేరా మేనేజ్ మెంట్ కమిటి చైర్మెన్ విపాసన ఇన్సాన్ డేరా ఆశ్రమం నుంచి పారిపో యారు. కాగా, ఇద్దరు సాధ్వీలపై లైంగికదాడికి పాల్పడ్డ కేసుల్లో గత నెల 25న సీబీఐ ప్రత్యేక కోర్టు డేరా బాబాను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.