Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందుకే లైంగికదాడులు : సాక్షి మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
భరత్పూర్ : బహిరంగ ప్రదేశాలు, కార్లు, పార్కుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, అటువంటి ప్రవర్తనే లైంగికదాడులకు దారి తీస్తోందని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఆరోపించారు. ఇలాంటి వారిని కటకటాల్లోకి నెట్టాలన్నారు. 'మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న జంటలు ఒకరినొకరు కౌగిలించుకుని కూర్చుంటున్నారు. అమ్మాయి అబ్బాయిని తినేసినట్లు, అబ్బాయిని అమ్మాయి తినేసినట్లు కౌగిలించుకుంటున్నారన్నారు. అదేవిధంగా కార్లు, పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో జంటలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారన్నారు. అలాంటివారిని ప్రజలు కూడా పట్టించుకోవడంలేదు. లైంగికదాడి జరిగిన తర్వాత మాత్రం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూన్నారు. ఇలాంటి జంటలను కటకటాల్లోకి నెట్టడమే సరైన చర్య' అంటూ వ్యాఖ్యానించారు. లైంగికదాడి కేసులో 20 ఏండ్లు జైలు శిక్ష పడిన డేరా చీఫ్ రామ్ రహీం సింగ్‌ను ఇటీవల సాక్షి మహారాజ్ సమర్థించారు. 'ఎన్నికలప్పుడు ఓట్ల కోసం కొంతమంది రాజకీయ నాయకులు అతని సహకారం కోరారు. లైంగికదాడి ఆరోపణలు చేసింది మాత్రం ఒకే వ్యక్తి. కానీ, కోట్లాది మంది భక్తులు అతడిని దేవుడిలా విశ్వసించారు' అంటూ డేరా చీఫ్‌కు శిక్ష పడిన అనంతరం వ్యాఖ్యానించారు.