Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ-అమిత్‌షా వ్యతిరేకిని: నటుడు ప్రకాశ్‌రాజ్
హైదరాబాద్: తాను హిందూ వ్యతిరేకిని కాదు, ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు వ్యతిరేకినని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. వాళ్లు నన్ను హిందూ వ్యతిరేకినని అంటున్నారు. కానీ, నేను మోడీ వ్యతిరేకిని,అమిత్‌షా వ్యతిరేకిని, హెగ్డే(కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డే) వ్యతిరేకినని ఇండియా టుడే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు. హంతకులకు మద్దతు తెలిపేవాళ్లు హిందువులు కాదని ప్రకాశ్‌రాజ్ అన్నారు. తన స్నేహితురాలు, జర్నలిస్ట్ గౌరీలంకేశ్ హత్య తర్వాత ప్రధాని మోడీ మౌనంగా ఉండటాన్ని ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించారు. మోడీ మద్దతుదారులు కొందరు గౌరీ హత్యకు మద్దతుగా సంబరాలు చేసుకోవడాన్ని ప్రకాశ్‌రాజ్ గుర్తు చేశారు. అటువంటి చర్యలకు నిజమైన హిందువు ఎవరూ మద్దతు ఇవ్వరని ఆయన అన్నారు. ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యల పట్ల ఇండియా టుడే కార్యక్రమానికి హాజరైన బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుకు ప్రకాశ్‌రాజ్ స్పందిస్తూ..మీరు నన్ను హిందూ వ్యతిరేకి అన్నపుడు మిమ్మల్ని హిందువు కాదని అనే హక్కు నాకూ ఉంటుందంటూ సమర్థించుకున్నారు.