Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పుట్టుకతో వచ్చిన కులాన్ని మార్చలేరనీ, పెండ్లయిన తర్వాత కూడా అది మారదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పంజాబ్ పటాన్కోట్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా ఒక మహిళ నియామకాన్ని కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది. 1991లో బులంద్‌షెహర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆ మహిళకు ఎస్సీ సర్టిఫికెట్‌ను జారీచేశారు. విద్యార్హతలు, కుల సర్టిఫికెట్ ఆధారంగా 1993లో ఆమె పటాన్‌కోట్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పోస్టుగ్రాడ్యు యేట్ టీచర్‌గా నియమితులయ్యారు. కాగా, 20 ఏండ్ల తర్వాత ఆమె నియామకాన్ని రద్దుచేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఎస్సీ వర్గానికి చెందని ఆమె రిజర్వేషన్ లబ్దిని పొందారనీ.. ఆమె నియామ కాన్ని రద్దుచేయాలని ఆ పిటిషన్లో కోర్టును కోరారు. 2015లో దర్యాప్తు నిర్వహించిన అధికారులు ఆమె కుల ద్రువీకరణ పత్రాన్ని రద్దుచేశారు. కేంద్రీయ విద్యాలయం కూడా ఆమె నియామకాన్ని రద్దుచేసింది. కేంద్రీ య విద్యాలయం నిర్ణయాన్ని సవాలుచేస్తూ ఆమె అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా, కోర్టు కూడా ఉద్యోగం నుంచి ఆమెను తొలగిం చడాన్ని సమర్థిస్తూ ఆమె పిటిషన్కొట్టివేసింది. ఆమె తిరిగి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా, హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించింది. ఆమె 20 ఏండ్లపాటు సర్వీసు చేసిన దృష్ట్యా.. ఆమెను నిర్బంధ పదవీ విరమణ కింద ట్రీట్ చేసి, ఇవ్వాల్సిన ఇతర సదుపాయాలను అందచేయాలని కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది.