Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షమాపణ చెప్పిన తమిళనాడు మంత్రి
చెన్నై : మహిళా జర్నలిస్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి తన వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేస్తు న్నట్టు ప్రకటించారు. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజరు భాస్కర్ ఒక మహిళా జర్నలిస్టును ఉద్దేశించి చేసిన సెక్సీ కామెంట్లు వివాదా స్పదం గా వారాయి.. 'నీ స్పెడ్స్ చాలా బాగున్నారు.. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావ్..' అని అంటూ లేడీ టీవీ రిపోర్ట్‌ను ఉద్దేశించి విజరు భాస్కర్ వ్యాఖ్యానించారు. కాగా, ఇది తీవ్ర వివాదం కావడంతో చివరకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. కావేరీ వాటర్ బోర్డ్‌కు సంబంధించి తమిళనాడు ప్రభుత్వ ముఖ్యులు జరిపిన సమావేశానికి విజరు భాస్కర్ హాజరయ్యాడు. సమావేశం ముగిసిన తర్వాత విలేకరులు ఏం మాట్లాడారో చెప్పాలని కోరారు. ప్రశ్నలడుగుతున్న వారిలో ఉన్న మహిళా జర్నలిస్టునుద్దేశించి పదేపదే 'నువ్వు అందంగా ఉన్నావు' అంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా వీడియోల్లో రికార్డు అయ్యింది. ఈ వివాదంపై మంత్రి మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నా రన్నారు.
జర్నలిస్టులంతా తనకు సోదరసోదరీమణులని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రశ్నలనుంచి తప్పించుకునేందుకే తాను అలా సమాధానం చెప్పానని అన్నారు. అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.